Maloth Kavitha Biography: గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె. చిన్నతనం నుంచి వారి కష్టాసుఖాలను దగ్గర నుంచి చూశారు. అలాగే.. అడవి బిడ్డలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న మహిళా గిరిజన నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె ఎవరో కాదు మహబూబాబాద్‌ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

Maloth Kavitha Biography: గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె. చిన్నతనం నుంచి వారి కష్టాసుఖాలను దగ్గర నుంచి చూశారు. అలాగే.. అడవి బిడ్డలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న మహిళా గిరిజన నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె ఎవరో కాదు మహబూబాబాద్‌ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

బాల్యం, విద్యాభ్యాసం

మాలోత్ కవిత.. రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి రెడ్యా నాయక్, లక్ష్మీ దంపతుల రెండవ సంతానం. ఆమె 1981 నవంబర్ 20న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మరిపెడ గ్రామంలో జన్మించారు. కవిత కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో ఎస్ఎస్సి పూర్తి చేశారు. ఆ తరువాత విజయవాడలోని శ్రీ చైతన్యలో జూనియర్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ రాంనగర్ లోని సెయింట్ కాలేజీ నుంచి బీఎస్సీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2001 మే 31న కవితకు సీతంపేట కి చెందిన భద్రు నాయక తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం 

కవిత తన తండ్రి డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్‌ స్థానంగా ఉన్న మహబూబాబాద్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యాయి. అవకాశం కలిసిరావడంతో 2009 లో కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి తెలంగాణ రాష్ట్ర సమతి ఆభ్యర్థి ఆజ్మీరా చందూలాల్ పై 15,367 ఓట్ల తేడాతో గెలుపొందారు. తమ ప్రాంతంలోని తాండవాసుల కళాభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పాటుపడ్డారు. కానీ, 2014లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. 

బీఆర్ఎస్ లో చేరిక 

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2014, నవంబరు 4న తన తండ్రి రెడ్యా నాయక్ తో కలిసి కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2019లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌పై 1.50 లక్షల మెజార్టీతో గెలుపొంది తన సత్తా ఏంటో చూపించారు. 2019లో మొత్తంగా 17 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరగగా ఇందులో గెలిచిన ఏకైక మహిళ ఎంపీగా కవిత మాలోత్ చరిత్ర సృష్టించారు. 

పదవులు 

2019 సెప్టెంబరు 19న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, 2019 అక్టోబరు 9న మహిళా సాధికారత కమిటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా నియమించబడింది. అలాగే.. 26 జనవరి 2022న మహబూబాబాదు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. ఆమె మొత్తానికి లంబాడాల నుంచి దేశంలోనే తొలి మహిళా ఎంపీగా గుర్తింపు పొందారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధి నాయకులతో కలుపుగోలుగా ఉంటూ పాలనలో సమర్థవంతంగా ముందుకెళ్తున్న ఆమె నాయకత్వ పటిమ ఆమె సొంతం. కాగా, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల కోసం మహబూబాబాద్‌ స్థానం నుంచి మరోమారు ఆమె అభ్యర్థిత్వాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది.