ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్‌ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాగర్ కర్నూలు లోక్ సభ స్థానం నుంచి తాను లక్షఓట్ల మెజారిటీతో గెలుస్తానని మల్లు రవి జోస్యం చెప్పారు. 

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొలువుదీరడం ఖాయమన్నారు. 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 220సీట్లు వస్తాయని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ఆయన రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమన్నారు. 

తెలంగాణలోనూ కాంగ్రెస్‌ ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. తుది విడతలో రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. 

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్‌ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాగర్ కర్నూలు లోక్ సభ స్థానం నుంచి తాను లక్షఓట్ల మెజారిటీతో గెలుస్తానని మల్లు రవి జోస్యం చెప్పారు.