ఇటీవల తనపై వివిధ వార్తా చానళ్లలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని తెలంగాణ కార్మిక, రవాణ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేవెళ్ల ఎంపీగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ప్రకటించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ వార్తను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎంపీల ఎంపిక విషయంతో పాటు పార్టీలో ఎలాంటి నిర్ణయమైన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకుంటారని తెలిపారు. ఆయన నిర్ణయానికి టీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు కట్టుబడి వుంటారని మల్లారెడ్డి వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా నుండి మంత్రివర్గంలో చేరిన మల్లారెడ్డి ఆ జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జిల్లాకు సంబంధించిన ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేవెళ్ల ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినట్లుగా ప్రచారం జరిగింది. ఈ స్థానం నుండి మాజీ మంత్రి, తాండూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫోటీ చేసి ఓటమిపాలైన పట్నం మహేందర్ రెడ్డి బరిలోకి దిగుతారని మల్లారెడ్డి ప్రకటించినట్లు ప్రముఖ వార్తా చానళ్లలో ప్రసారమయ్యాయి.
అయితే టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికకోసం ఇంకా కసరత్తు ప్రారంభించకుండానే మల్లారెడ్డి ఏకంగా అభ్యర్థిని ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చిన మంత్రి తానలా మాట్లాడలేదన్నారు. తమపై జరిగిన తప్పుడు ప్రచారంలో భాగంగా ఈ గందరగోళం నెలకొందని మంత్రి మల్లారెడ్డి తాజాగా వెల్లడించారు.