హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

మృతురాలిది మిర్యాలగూడ.  మైసమ్మగూడ లోని కృప వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. వసతి గృహం భవనంపై నుండి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చంద్రికకు బ్యాక్ లాగ్స్ ఉన్నాయని కాలేజీ యాజమాన్యం చెబుతోంది.

చదువులో వెనకబడ్డాననే మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న పెట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.