కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. మంగళవారం ఢిల్లీ టెన్‌ జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి కుటుంబసభ్యులతో చేరుకున్నారు.

ఆమెను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు రేవంత్ వెల్లడించారు. అయితే రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సోనియా అధికారికంగా ప్రకటించనున్నారని.. అందుకే రేవంత్ తన కుటుంబసభ్యులతో కలిసి సోనియాను కలిశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రేవంత్ స్పందించాల్సి వుంది.