Asianet News TeluguAsianet News Telugu

మంత్రి కేటీఆర్‌ను కలిసిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ (malavat poorna) గురువారం మంత్రి కేటీఆర్‌ను (ktr) ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన "పూర్ణ" పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌కి అందించారు. 

malavat poorna met minister ktr at pragathi bhavan
Author
Hyderabad, First Published Dec 2, 2021, 8:06 PM IST

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ (malavat poorna) గురువారం మంత్రి కేటీఆర్‌ను (ktr) ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన "పూర్ణ" పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌కి అందించారు. ఈ సందర్భంగా పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్... ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 

ALso Read:డిమాండ్ ఉన్న పంట‌లే వేయండి... పోలాల్లో కాలినడక, రైతులకి కేసీఆర్ సూచనలు

కాగా.. నిజామాబాద్ (nizamabad districr) జిల్లా పాకాల (pakala) గ్రామానికి చెందిన పూర్ణ నిరుపేద కుటుంబంలో జన్మించిన సంగతి తెలిసిందే. చదువంతా సాంఘిక సంక్షేమ పాఠశాలలో పూర్తి చేసింది. అక్కడే ఆమెకు పర్వతారోహణ శిక్షణ మొదలైంది. అప్పటి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ (praveen kumar) ప్రోత్సాహంతో భువనగిరిలో మొదలైన శిక్షణ.. లఢఖ్, డార్జిలింగ్‌, మైట్రినా తదితర ప్రాంతాల్లో సాగింది. అనంతరం ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలైన ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్‌బ్రస్, కార్ట్ స్నేజ్, విన్సన్ మాసిఫ్‌లను అధిరోహించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios