హైదరాబాద్:  హైద్రాబాద్‌లోని ఆబిడ్స్‌కు సమీపంలోని మొజంజాహీ మార్కెట్‌లో బుధవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అధికారులు వెంటనే ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొజంజాహీ మార్కెట్‌లోని గోడౌన్‌లో  ఇవాళ మధ్యాహ్నం ఆకస్మాత్తుగా  మంటలు చేలరేగాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు.

ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గోడౌన్ల పక్కనే మరికొన్ని గోడౌన్లు ఉన్నాయి.పక్కనే ఉన్న గోడౌన్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.