Asianet News TeluguAsianet News Telugu

యజమాని కళ్లుగప్పి నగలు చోరీ.. పనిమనిషి అరెస్ట్..

నమ్మకంగా పని చేస్తున్నట్లు నటించి ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు దొంగిలించింది ఓ పనిమనిషి. ఈ ఘటనలో యజమాని ఫిర్యాదు మేరకు నిందితురాలిని బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. 

maid stealing gold ornaments in income tax quarters in banjara hills, arrested - bsb
Author
hyderabad, First Published Mar 24, 2021, 3:57 PM IST

నమ్మకంగా పని చేస్తున్నట్లు నటించి ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు దొంగిలించింది ఓ పనిమనిషి. ఈ ఘటనలో యజమాని ఫిర్యాదు మేరకు నిందితురాలిని బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. 

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఇన్కమ్ టాక్స్ క్వార్టర్స్ అపార్ట్మెంట్లలో నివసించే ఉదయ్ భాస్కర్ అనే అధికారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. అదే ప్రాంతానికి చెందిన సరోజా అనే మహిళ గత కొంత కాలంగా ఉదయ్ భాస్కర్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. 

ఈ నెల 15వ తేదీన ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు నగలపై ఆమె కన్నుపడింది. యజమాని లేని సమయంలో 9 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించి ఆ రోజు నుంచి పనికి రావడం మానేసింది. విషయం తెలుసుకున్న ఉదయభాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు అనుమానితురాలు సరోజను తమదైన శైలిలో విచారించడంతో దొంగిలించిన సొమ్ము గురించి ఒప్పుకుంది. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సరోజను రిమాండ్ కు తరలించారు. క్రైమ్ ఎస్ఐ భరత్ భూషణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios