నగర బహిష్కరణను సవాలు చేస్తూ కత్తి మహేశ్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. కాగా.. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది.

సినీ క్రిటిక్, తెలుగు బిగ్ బాస్1 కంటిస్టెంట్ కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణ వేటు ఎత్తివేస్తారా..? ఈ నిర్ణయం మాత్రం కోర్టు తీసుకోనుంది. ఎందుకంటే.. తనపై విధించిన నగర బహిష్కరణ వేటు ఎత్తివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

నగర బహిష్కరణను సవాలు చేస్తూ కత్తి మహేశ్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. కాగా.. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. తనపై ఉన్న నగర బహిష్కరణను ఎత్తి వేయాలంటూ పిటిషన్‌లో కత్తి మహేశ్‌ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

దీంతో కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల సమయం కావాలని కోరారు. దీనికి సమ్మతించిన హైకోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది.