Asianet News TeluguAsianet News Telugu

నేను సీఎం అయితే.....: పొలిటికల్ ఎంట్రీపై ప్రిన్స్ మహేష్ బాబు

తన పొలిటికల్ ఎంట్రీపై ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. తాను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని ఆయన అన్నారు. తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని మహేష్ బాబు అన్నారు.

Mahesh babu spreaks on his political entry
Author
Hyderabad, First Published Feb 18, 2020, 8:16 AM IST

హైదరాబాద్: తాను రాజకీయాల్లో ప్రవేశించడంపై ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. మీరు ఒక రోజు సీఎం అయితే ఏం చేస్తారని ప్రశ్నిస్తే తాను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని ఆయన సమాధానం ఇచ్చారు. తాన రాజకీయాల్లో తాను ప్రవేశించి విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. 

తన దృష్టి అంతా సినిమాల మీదనే అని, రాజకీయాల గురించి తనకు ఏమీ తెలియదని మహేష్ బాబు అన్నారు. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్ాచరు. అందులో భాగంగా తన పొలిటికల్ ఎంట్రీపై కూడా మాట్లాడారు.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మహేష్ బాబు సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలంగాణ రాములమ్మ, లేడీ అమితాబ్ విజయశాంతి కూడా నటించారు. ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. 

ఆ తర్వాత తన 27వ సినిమాకు సిద్ధం కానున్నారు. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరోసారి ఆయన నటించబోతున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. 

గతంలో కూడా మహేష్ బాబు రాజకీయాల్లో ప్రవేశించే విషయంపై ఇదే విధంగా స్పందించారు. తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని, తాను సినిమాలకే పరిమితమవుతానని ఆయన పలుమార్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios