హీరో మహేష్ బాబుకు రైతు బంధు చెక్కులు

Mahesh babu gets amount under Rythu Bandhu scheme
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం కింద హీరో మహేష్ బాబుకు చెక్కులు అందాయి.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం కింద హీరో మహేష్ బాబుకు చెక్కులు అందాయి. ఆయనకు మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో 39.2 గుంటల భూమి ఉంది. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కు 1.20 ఎకరాల భూమి ఉంది.

రైతు బంధు పథకం కిందవారికి రూ. 16 వేల రూపాయలు చెక్కుల రూపంలో అందాయి. అయితే, ఆ చెక్కులను మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి నమ్రత అందజేశారు. 

వీరితో పాటు నిర్మాత రవిశంకర్ కూడా తన రెండు ఎకరాల భూమికి వచ్చిన రైతుబంధు చెక్కులను తిరిగి ఇచ్చేశారు. రైతు బంధు పథకం కింద తమకు ప్రభుత్వం నుంచి అందిన సొమ్మును స్తోమత కలిగినవారు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నారు. 

అందులో భాగంగానే మహేష్ బాబుకు, తనకు అందిన సొమ్మును నమ్రత ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.

loader