Asianet News TeluguAsianet News Telugu

కొనే స్థోమత లేక.. కాడెద్దులైన కొడుకులు... ఓ రైతు దయనీయ స్థితి..

ఆరుపదుల వయసులో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో కొడుకులతోగొర్రుతో కరిగెట చేయిస్తున్నారు. వెంట తాను కూడా కొడుకులకు సాయం చేస్తున్నాడు. కాడెద్దులు కొనలేక రైతు చేస్తున్న ఈ సాహసం అందరి కంటా కన్నీళ్లు పెట్టిస్తోంది. 

mahabubnagar farmer sons work like buffaloes for farming - bsb
Author
Hyderabad, First Published Jan 18, 2021, 3:00 PM IST

ఆరుపదుల వయసులో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో కొడుకులతోగొర్రుతో కరిగెట చేయిస్తున్నారు. వెంట తాను కూడా కొడుకులకు సాయం చేస్తున్నాడు. కాడెద్దులు కొనలేక రైతు చేస్తున్న ఈ సాహసం అందరి కంటా కన్నీళ్లు పెట్టిస్తోంది. 

కాడెద్దులను కొనలేని ఓ నిరుపేద తన కన్నకొడుకులనే కాడెద్దులుగా చేశాడు. కొడుకుల చేత గొర్రుతో కరిగెట చేస్తున్నాడు. గుండెలు పిండేసే ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మండలంలోని దోరేపల్లి శివారులో చోటుచేసుకుంది. 

దోరేపల్లిలో శివగారి పెద్ద రాములు వ్యవసాయ రైతు. అతనికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. పదిసార్లు బోర్లు వేస్తే పదకొండోసారి నీళ్లు పడ్డాయి. అన్నిసార్లు బోర్లు వేయడంతో అప్పులు కూడా అధికం అయ్యాయి. దీంతో సాగు కోసం కాడెద్దులు కొనలేకపోయాడు. 

అయితే నీళ్లు పడ్డాయి కాబట్టి పంట సాగు చేయాలనుకున్నాడు. దీంతో విధి లేక కొడుకుల్ని కాడెద్దులుగా చేసి తన కొడుకుల చేత గొర్రును లాగిస్తూ కరిగెట చేయిస్తున్నాడు. రైతు రాములు చూసిన కష్టం చూసి స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

నమ్మిన భూమిని, వ్యవసాయాన్ని వదులుకోలేక రాములు కష్టాన్ని చూసి ప్రభుత్వమే అతనికి సాయం చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులునిరుపేద రైతులకే చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios