కౌన్సిలర్ బానోతు రవి హత్య కేసు నిందితుల గుర్తింపు: ఎస్పీ శరత్ చంద్ర
మహబూబాబాద్ లో టీఆర్ఎస్ కౌన్సిలర్ రవి హత్య చేసిన నిందితులను గుర్తించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. కారులో వచ్చి నిందితులు రవిని హత్య చేసి పారిపోయారన్నారు. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమన్నారు.
మహబూబాబాద్: పట్టణంలోని 8వ వార్డు Trs councillo బానోత్ రవి హత్య కేసులో ఇద్దరు నిందితులను గుర్తించామని మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర చెప్పారు.Banoth Ravi హత్యపై గురువారం నాడు జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar మీడియాతో మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం 11:30 గంటల నుండి 12:00 గంటల మధ్య హత్య జరిగిందని ఎస్పీ చెప్పారు.
పత్తిపాకలో Bike పై వెళ్తున్న బానోతు రవిని ట్రాక్టర్ అడ్డు పెట్టి హత్య చేశారని ఎస్పీ చెప్పారు. కారులో వచ్చిన ఇద్దరు రవిని హత్య చేసినట్టుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు నాలుగు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఎస్పీ చెప్పారు. రవి హత్యకు రాజకీయ కారణాలు కారణం కాదన్నారు. ఆర్దిక లావాదేవీల కారణంగానే రవి హత్య జరిగిందని ఎస్పీ స్పష్టం చేశారు.
Mahabubabad లో ఇవాళ టీఆర్ఎస్ కౌన్సిలర్ రవిని దుండగులు హత్య చేశారు. తనకు ప్రాణహాని ఉందని రవి గతంలో స్నేహితులకు చెప్పారు. రవినాయక్ కు భార్య ముగ్గురు పిల్లలున్నారు. దుండగులు గొడ్డలితో దాడి చేసిన తర్వాత కొనఊపిరితో ఉన్న రవి నాయక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి నాయక్ మరణించినట్టుగా వైద్యులు చెప్పారు.
ఇవాళ ఉదయం కూడా తమతో కలిసి ఓ కార్యక్రమంలో రవి నాయక్ పాల్గొన్నాడని కూడా మహబూబాబాద్ ఎంపీ కవిత చెప్పారు. గంటన్నర తర్వాత రవి నాయక్ హత్యకు గురైనట్టుగా తిలిసి షాక్ కు గురైనట్టుగా ఆమె చెప్పారు. రవి నాయక్ మృతి తమ పార్టీకి లోటన్నారు. పార్టీలో రవి నాయక్ చురుకుగా ఉండేవారన్నారు.