మహబూబ్ నగర్ కా బాద్ షా ఎవరు అంటూ తేల్చుకోవడానికి ఈ మునిసిపల్ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. జూపల్లి గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 

ఆ తరువాత గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి తెరాస లో చేరడంతో అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేకి పొసగడం లేదు. ఇంతలోనే మంత్రి నిరంజన్ రెడ్డి రాజకీయాలు కూడా తోడవడంతో మహబూబ్ నగర్ రాజకీయాలు వేడెక్కాయి. 

మునిసిపల్ ఎన్నికల్లో తన వర్గం వారికి తగిన ప్రాధాన్యం దక్కడంలేదని భావించిన జూపల్లి, తన వర్గాన్ని రెబెల్స్ గా ఫార్వర్డ్ బ్లాక్ తరుఫున పోటీ చూపించాడు. వారే కొల్లాపూర్, ఐజ మునిసిపాలిటీలు కైవసం చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ జూపల్లికి ఫోన్ చేసారు. హుటాహుటిన హైద్రాబాబ్డ్ రమ్మన్నట్టు సమాచారం. జూపల్లి వర్గానికే ఆ మునిసిపాలిటీలు కట్టబెట్టి అక్కడ గులాబీ జెండాను ఎగరేయాలని భావిస్తోంది తెరాస. అందుకే జూపల్లికి ఫోన్ చేసారని తెలుస్తుంది. జూపల్లి కూడా హుటాహుటిన బయల్దేరి హైదరాబాద్ వెళ్లారు. ఆయన నేరుగా తెలంగాణ భావం కి చేరుకోనున్నారు.