ఉద్యోగాల పేరుతో మోసం: వికారాబాద్ లో మధుకర్ ను ఆలయంలో నిర్భంధించిన బాధితులు
పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన మధుకర్ అనే యువకుడిని నిర్భంధఇంచారు. దోమ మండలం ఊటుపల్లి ఆలయంలో మధుకర్ ను బంధించారు. డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామని తేల్చి చెప్పిన బాధితులు.
వికారాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే నెపంతో వికారాబాద్ జిల్లాలో మధుకర్ అనే యువకుడిని బాధితులు గుడిలో నిర్భందించారు. తమ వద్ద వసూలు చేసిన రూ. 7 లక్షలను తిరిగి చెల్లించాలని కూడా బాధితులు కోరుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి గ్రామానికి చెందిన మధుకర్ అనే యువకుడు గ్రామ సెక్రటరీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేశాడు. నిరుద్యోగుల నుండి సుమారు రూ. 7 లక్షలను వసూలు చేశారు. ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్న మధుకర్ ను బాధితులు నిలదీశారు. అయినా అతను డబ్బులుఇవ్వలేదు. దీంతో బాధితులు మధుకర్ ను తీసుకు వచ్చి దోమ మండలం ఊటుపల్లి గ్రామంలోని ఆలయంలో బంధించారు.
మూడు రోజులుగా ఆలయంలోనే మధుకర్ ను బంధించారు. తమ డబ్బుల విషయమై స్పష్టత ఇచ్చేవరకు తాము అతను వదిలిపెట్టబోమని బాధితులు చెబుతున్నారు. అయితే తమ వ్యవసాయ భూమిని విక్రయించి బాధితులకు రూ. 7 లక్షలు చెల్లిస్తామని బాధితులకు మధుకర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తమకు డబ్బులు చెల్లించిన తర్వాతే మధుకర్ ను వదులుతామని బాధితులు చెబుతున్నారని మధుకర్ పేరేంట్స్ చెబుతున్నారని ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.