హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో లాలాగూడ స్టేషన్ హౌస్ ఆపీసర్ గా మధులతను నియమించారు. హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా మహిళా పోలీస్ అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నియమించారు.
హైదరాబాద్: అంతర్జాతీయ Women దినోత్సవాన్ని పురస్కరించుకొని Hyderabad పోలీసులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. Lalaguda స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా సీఐ మధులతను నియమించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా మహిళా CI ను నియమించడం హైద్రాబాద్ చరిత్రలో ఇదే తొలిసారి.
South Zone పాతబస్తీ ఉమెన్ పీఎస్ లో సీఐగా ఉన్న Madhulatha ను లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా మంగళవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ , హైద్రాబాద్ సీపీ సీవీ Anand సమక్షంలో మధులత ఇవాళ భాద్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు స్టేషన్ ఆఫీసర్ గా పురుషులే కొనసాగారు. అయితే SHO గా మహిళా సీఐను నియమించాలని హైద్రాబాద్ సీపీ నిర్ణయం తీసుకొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మధులతను స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నియమించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా మహిళా సీఐను ఎందుకు నియమించవద్దనే ఆలోచన రావడంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మహిళలకు సరైన స్థానం, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్టుగా సీపీ ఆనంద్ వివరించారు. మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో వేధింపులు చాలా వరకు తగ్గాయని సీపీ తెలిపారు.మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
