నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. అనుమానంతో భార్యను చంపేసి, కూతురును గాయపర్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాలో ఈ ఘటన బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. 

జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం చింతకుంట్లతండాకు చెందిన 22 ఏళ్ల అఖిలకు  నాలుగేళ్ల క్రితం నాంపల్లి మండలం రాందాస్ తండాకు చెందిన మధుతో వివాహం జరిగింది. వీరికి పద్దెనిమిది నెలల కూతురు ఉంది.

మధు వృత్తిరీత్యా బోరుబండిపై పనిచేస్తున్నాడు. దీంతో చాలా కాలం భార్యకు దూరంగా ఉండేవాడు..ఈ క్రమంలోనే మధు భార్యపై అనుమానం పెంచుకొన్నాడు. దీంతో భార్యతో గొడవకు దిగేవాడు.

దసరాకు ముందు కూడ భార్యతో మధు గొడవపడ్డాడు.ఈ గొడవతో ఆమె పుట్టింటికి వెళ్లింది..నాలుగు రోజుల క్రితం  మధు తన భార్యను పుట్టింటి నుండి తన ఇంటికి తీసుకొచ్చాడు.మూడు రోజులు బాగానే ఉన్నారు..

Also read:నాపై జైలులో లైంగిక దాడి: నిర్భయ దోషి ముఖేష్ సంచలనం

బుధవారం నాడు భార్యాభర్తలు మరోసారి గొడవకు దిగారు..కోపంతో మధు తన భార్యపై కర్రతో దాడికి దిగాడు.దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కూతురును కూడ గాయపర్చాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో మధు తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లారు.

సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించారు. అప్పటికే మధు, అఖిలలు మృతి చెందారు. చిన్నారి మిల్కీ ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యపై అనుమానం కారణంగా మధు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా స్థానికులు చెబుతున్నారు. భార్యను పుట్టింటి నుండి తీసుకొచ్చిన మధు ఇద్దరు కలిసి ఉంటారని భావించామని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఇలా జరుగుతోందని తాము భావించలేదని మదు కుటుంబసభ్యుులు చెబుతున్నారు.

క్షిణికావేశంలో తీసుకొన్న నిర్ణయం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉంది. ఈ ఘటన గ్రామంలలో విషాదాన్ని నింపింది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.