Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నాని, వంశీలను లేపేయ్యాలంటూ వ్యాఖ్యలు.. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే ఇలా: క్షమాపణలు చెప్పిన మల్లాది వాసు

కమ్మ కులంలో చీడపురుగుల్లా తయారైన ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన కామెంట్స్ చేసిన ఖమ్మం జిల్లా మధిర టీఆర్‌ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 

madhira trs councillor malladi vasu clarity over his comments on kodali nani and vallabhaneni vamsi
Author
Madhira, First Published Dec 2, 2021, 2:26 PM IST

కమ్మ కులంలో చీడపురుగుల్లా తయారైన ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన కామెంట్స్ చేసిన ఖమ్మం జిల్లా మధిర టీఆర్‌ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు కుటుంబం మీద ఉన్న అభిమానం, కమ్మ కులానికి జరుగుతోన్న అన్యాయం చూసి ఆవేదనతోనే వ్యాఖ్యలు చేశానని వాసు తెలిపారు. తనకు ఏ రకమైన నేర చరిత్ర లేదని.. హత్యలు చేయించే సంస్కృతి తనది కాదని వాసు చెప్పుకొచ్చారు. 

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూసి బాధతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే తన వీడియోని వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఎవరి మీదా కక్షలు లేవని.. స్కెచ్ వేయటం.. అందుకోసం డబ్బులు ఖర్చు చేయటం లాంటి ఉద్దేశాలు లేవని వెల్లడించారు. కమ్మ కమ్యూనిటీ, వెల్ఫేర్, సంక్షేమం కోసమే మాత్రమే ఖర్చు పెడతానని వాసు వివరించారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అంతేకాదు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వాసు స్పష్టం చేశారు. కుటుంబంలోని మహిళల మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.

Also Read:కొడాలి నాని, వంశీలను లేపేస్తే.. రూ.50 లక్షల రివార్డ్ : టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

కాగా... ఇటీవల జరిగిన కమ్మ వన సమారాధానలో టీఆర్ఎస్ (trs) నేత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు (malladi vasu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చీడ పురుగులైన కొడాలి నాని (kodali nani) , వల్లభనేని వంశీలతో (vallabhaneni vamsi) పాటు అంబటి రాంబాబును (ambati rambabu) భౌతికంగా నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురిని భౌతికంగా లేకుండా చేస్తే రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. పరిటాల రవి బతికుంటే ఇవాళ ఏపీలో ఈ పరిస్ధితి వచ్చేది కాదన్నారు.

పరిటాల రవి (paritala ravi) హత్య వెనుక ఆనాటి ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆయన ఆరోపించారు. మొద్దుశ్రీను అనే క్రిమినల్‌ను పెట్టి ఒక ఆపరేషన్ ప్లాన్ చేసి.. పరిటాల రవిని హత్య చేశారని మల్లాది వాసు ఆరోపించారు. సమయం ఆసన్నమైందని.. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని, కులంలో వున్న కొన్ని చీడ పురుగుల్ని ఏరేసే ఆపరేషన్ ప్రారంభించాలని మల్లాది వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కౌన్సిలర్‌గా వున్న మల్లాది వాసు... కమ్మ సంఘం వన సమారాధనలో ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపారు.

Follow Us:
Download App:
  • android
  • ios