Macherla Passenger Train: గమ్యం చేరకుండానే.. రైలు అర్థంతరంగా నిలిపివేత.. అర్థరాత్రి ప్రయాణికుల అవస్థలు..
Macherla Passenger Train Stopped: మాచర్ల ప్యాసింజర్ రైలును నడికుడి వద్ద అర్థంతరంగా అధికారులు నిలిపివేశారు. గుంటూరు జిల్లా మాచర్ల వరకు వెళ్లాల్సిన ప్యాసింజర్ రైలును అకస్మాత్తుగా నిలిపివేయడంతో .. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మాచర్ల వరకు టిక్కెట్‌లు తీసుకొన్న ప్యాసింజర్లు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చింది

Macherla Passenger Train: రైల్యే అధికార, యాంత్రిక సమన్వయ లోపం వల్ల.. ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే లైన్ బ్లాక్ అయిన విషయాన్ని విస్మరించిన అధికారులు.. ప్యాసింజర్‌కు టిక్కెట్‌లు జారీచేశారు. ట్రాక్ క్లియరెన్స్ ఉండటంతో రైలు కు సిద్దమయ్యింది. ప్రయాణీకులకు తమ ప్రయాణానికి సిద్దమయ్యారు. రాత్రి ప్రయాణం సాఫీగా సాగుతోంది. ప్రయాణీకులు నిద్రలో జారుకున్నారు. అంతలోనే.. అర్థరాత్రి రైలును నిలిపివేసి.. ఇదే చివరి స్టేషన్.. ఇక ముందుకు వెళ్లదని అనడంతో ప్రయాణీకులు ఖంగు తిన్నారు. ఆ అర్థరాత్రి ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు ప్రయాణీకులు. ఈ ఘటన మాచర్ల ప్యాసింజర్లో ప్రయాణిస్తోన్న ప్రయాణీకులు ఎదురైంది.
వివరాల్లోకెళ్తే.. విజయవాడ - మాచర్ల ప్యాసింజర్ రైలు.. డిసెంబర్ 9వ తేదీన నడికుడి రైల్వేయార్డులో మర్మత్తులు జరగడంతో ట్రాక్ ను బ్లాక్ చేశారు డివిజన్ అధికారులు. దక్షిణ మధ్య రైల్వే జోన్ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ ట్రాక్ మీద నడిచే విజయవాడ - మాచర్ల ప్యాసింజర్ 9 వ తేదీన నడికుడి వరకు నడిపి అక్కడి నుంచి రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ తరువాత రోజు 10 తేదీన మాచర్లలో బయలుదేరే ప్యాసింజర్ రైలుని నడికుడి నుంచి ప్రారంభించేలా అనుమతించింది
అయితే.. ఈ విషయాన్ని జోనల్ అధికారులు గానీ, ఇటు విజయవాడ, గుంటూరు డివిజన్ అధికారులుగానీ, ఈ విషయాన్ని సర్క్యులర్ ద్వారా ప్రయాణీకులకు తెలియజేయాలి. ఎక్కడ లైన్‌బ్లాక్ ఉంటుందో ఆ తదుపరి స్టేషన్లకు టిక్కెట్‌లను జారీ చేయకూడదు. ఈ విషయాన్ని కనీసం వెబ్‌సైట్‌లోనైనా అప్‌డేట్ చేయాలి. అయితే.. ఇలాంటి చర్యలేమీ .. జరగలేదు. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు.
రోజులానే 9 వ తేదీన రైలుకు విజయవాడ మొదలుకొని నడికుడి వరకు అన్ని స్టేషన్ల సిబ్బంది మాచర్లకు టిక్కెట్‌లు జారీచేశారు. జరిగింత జరిగినా తరువాత చివరికి నడికుడి స్టేషన్ లో అర్థంతరంగా రైలును నిలిపివేసి.. అసలు విషయాన్ని ప్రయాణీకులకు చెప్పారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థంతరంగా రైలును నిలిపివేయడంతోపాటు ఎలాంటి రవాణా సౌకర్యం వారికి కల్పించకపోవడంతో.. రైల్వే సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రివేళ ఎక్కడకు వెళ్లాలని? ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.
ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. కఠిన తగిన చర్యలు చేపట్టాల్సిన రైల్వేశాఖ అందుకు భిన్నంగా మిన్నకుండిపోయింది. కనీసం నడికుడి దాటిన తర్వాత స్టేషన్లకు జారీ చేసిన టిక్కెట్లకు సంబంధించి నగదుని కూడా వాపసు చేయకుండా చోద్యం చూస్తోండటంపై రైల్వే వినియోగదారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నాయి.