ఆర్యసమాజ్ లో ప్రేమపెళ్లి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తరువాత...
ఆ తరువాత ఇద్దరూ కలిసి సాయి ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం వేకువజామున శ్రీశాంక తల్లి, మేనమామ, ఇతర బంధువులైన తిలక్ నగర్ కు చెందిన రౌడీషీటర్ తో కలిసి వచ్చి సాయి కుటుంబ సభ్యులను కర్రలు, ఇతర మారణాయుధాలతో బెదిరించి శ్రీశాంకను తీసుకెళ్లారు.
పెద్దపల్లి : ఓయువతి, యువకుడు love marriage చేసుకోవడం రెండు కుటుంబాల మధ్య వివాదానికి దారి తీసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సీఎస్పీ కాలనీకి చెందిన శనిగరం సాయి హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీశాంకతో సాయికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఇంట్లో చెబితే ఒప్పుకోరని, వారిద్దరూ ఈ నెల ఒకటో తేదీన హైదరాబాద్ Arya Samajలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి గోదావరిఖని వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అక్కడ తమ వివాహం సంగతి, ఇంట్లో పరిస్థితులు వివరించి.. పెద్దలకు ఇష్టం లేని సంగతి చెప్పి.. తమకు రక్షణ కావాలని కోరారు.
ఆ తరువాత ఇద్దరూ కలిసి సాయి ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం వేకువజామున శ్రీశాంక తల్లి, మేనమామ, ఇతర బంధువులైన తిలక్ నగర్ కు చెందిన రౌడీషీటర్ తో కలిసి వచ్చి సాయి కుటుంబ సభ్యులను కర్రలు, ఇతర మారణాయుధాలతో బెదిరించి శ్రీశాంకను తీసుకెళ్లారు.
రోడ్డు ప్రమాదం: కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన బస్సు, కారు డ్రైవర్ మృతి
దీంతో సాయి కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు తీసుకెళ్లిన కారు వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిఖని ఏసిపి ఎస్.గిరి ప్రసాద్, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు విచారణ చేపట్టారు.
సాయి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లితో పాటు, మేనమామలు, మరో నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు, కిడ్నాప్ కేసు సైతం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.