హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్రెండ్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమ జంట స్వస్థలం పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్, జ్యోతిలుగా గుర్తించారు. వీరు ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. వివాహానికి హాజరైన అనంతరం ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లారు. అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
