పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్, ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. తమ ప్రేమ వివాహం పెద్దలకు చెప్పారు. అయితే, వీరి వివాహనికి పెద్దలు అంగీకరించలేదు. 

దీంతో మనస్తాపానికి గురైన జంట గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. మొద్దుల చెరువు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకన్నారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేమాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.