సిద్ధిపేటలో విషాదం చోటు చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదనే మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన హరిక, ఆనంద్ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావివద్ద పురుగుల మందు సేవించారు.

విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు వీరిద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాయి. అయితే కొద్దిసేపటికే చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

దీంతో వెంకటాపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హరిక, ఆనంద్‌ మృతితో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.