పెద్దపల్లిలో విషాదం: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట సూసైడ్
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలోని కనుకు గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది. వేర్వేరు కులాలు కావడంతో ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు.
కరీంనగర్: Peddapalli జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. sultanabad మండలంలోని కనుకులలో Shiva అదే గ్రామానికి చెందిన యువతి సుస్మితను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసకోవాలని కూడా భావించారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ విషయమై రెండు కుటుంబాల సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు కూడా ఈ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు.
అంతేకాదు ఇద్దరు కూడా మైనర్లే. ఈ రెండు కారణాలను చూపి Marriage కి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియుడు శివ సోమవారం నాడు Suicideకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకొన్న ప్రియురాలు సుస్మిత ఇవాళ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.