తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని చాలా మంది ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే... ఈ ప్రేమికులు మాత్రం భిన్నం. అతనికి అప్పటికే పెళ్లై.. భార్య , కొడుకు ఉన్నాడు. వారిని కాదని ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాగా.. తమ ప్రేమను ఎవరూ అంగీకరించడం లేదంటూ ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ సంఘటన కాగజ్ నగర్ లో చోటుచేసుకుంది.

Also Read తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా: 41కి చేరిన పాజిటివ్ కేసులు...

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...దహేగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన  సంతోష్‌ (35), కాగజ్‌నగర్‌ మండలం కొత్తసార్సాల గ్రామానికి చెందిన యువతి డోకే శైలజ (20)లు బుధవారం తెల్ల వారుజామున అంకుశాపూర్‌ గ్రామం సమీపంలో రిజర్వు ఫారెస్టులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

దహేగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన జ్యోతితో సంతోష్‌కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా వారికి 5సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కానీ ఇటీవల కాగజ్‌నగర్‌ మండలం సార్సాల గ్రామానికి చెందిన శైలజతో సంతోష్‌ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.