వారిద్దరూ ఒకరిని మరొకరు పన్నెండు సంవత్సరాలపాటు ప్రేమించుకున్నారు. చివరిదాకా కలిసి జీవించాలని కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు పది నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. కానీ వారి కలలు ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన పది నెలలకే.. ఆత్మహత్య చేసుకొని ఇద్దరు తనువు చాలించారు. ఈ దారుణ సంఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెల్లంపల్లి లోని సుభాష్ నగర్ కు చెందిన మోసం మల్లేష్ కుమార్(36), బాబు క్యాంపు బస్తీకి చెందిన నర్మద(28) లు పన్నెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పది నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు.  నర్మద ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా.. మల్లేష్.. ఓ ప్రైవేట్ టీవీ ఛానెలలో టీవీ రిపోర్ట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక.. చనిపోదామనే నిర్ణయించుకున్నారు.

స్నేహితులకు మెసేజ్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి.. ఇద్దరూ వెళ్లి చెరువులోకి దూకేశారు.  వెంటనే స్నేహితులు, కుటుంబసభ్యులు వారి కోసం వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. మల్లేష్ మృతదేహం బయటపడింది. కానీ.. నర్మద మృతదేహం మాత్రం చాలా ఆలస్యంగా బయటపడింది.

అనారోగ్యం కారణంగానే తాము ఆత్మహత్య చేసుకున్నామంటూ సూసైడ్ లేఖ రాయడం గమనార్హం. కాగా.. ఆ లేఖ చూసి ఇరువైపుల బంధువులు విషాదం వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.