Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలోకి చాలా మంది రావాలని అనుకుంటున్నారు.. పార్టీలో చేరితే సముచిత స్థానం: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారని.. పార్టీలో చేరినవారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. 

Lot Of leaders Wants to join bjp says bandi sanjay
Author
First Published Aug 3, 2022, 11:31 AM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారని.. పార్టీలో చేరినవారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వం నమ్మి, బీజేపీ సిద్దాంతం నమ్మి.. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన, అరాచక పాలన వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని చెప్పారు. ఉద్యమ స్పూర్తిని దెబ్బతీసేలా కేసీఆర్, ఆయన  కుటుంబం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతుంది బీజేపీ మాత్రమేనని చెప్పారు. అనేక సర్వేలను చూసి, టీఆర్ఎస్‌పై తమ పోరాటాన్ని చూసి బీజేపీలోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఉద్యమించే నాయకులకు బీజేపీ వేదిక అన్నారు. అవినీతి పాలనపై కొట్లాడే పార్టీ బీజేపీనేనని అన్నారు. బీజేపీ ఉద్యమ ఆకాంక్షలు తీర్చుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.  

ఇక, బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ... నెక్ట్స్ ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం ఏంటో చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పేరుతో కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. ఎంతో బాగున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్ చెడగొట్టారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. 

నాణ్యత లేకుండా పనులు చేపట్టడం వల్లే అవి అప్పుడే కూలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నల్గొండ గడ్డపై పుట్టిన శ్రీకాంతాచారి ఎవరి కోసం బలయ్యాడని ఆయన ప్రశ్నించారు. పిడికెడు బువ్వ కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ ఎవరికైనా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios