తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. నగదు, మద్యంతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టే అంశాలపై కన్నేసి ఉంచారు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల విధుల్లో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామడుగు పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ షఫియొద్దీన్ ఒక లారీనీ ఆపేందుకు ప్రయత్నించాడు.

అయితే వేగంగా వస్తుండటం.. డ్రైవర్ బ్రేకులు వేయడం ఆలస్యమవ్వడంతో రోడ్డుపై ఉన్న హెడ్ కానిస్టేబుల్ మీదకు లారీ దూసుకెళ్లింది. దీంతో షఫియొద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.