హైదరాబాద్‌లో తృుటిలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు బస్సుపై లారీ పడింది. వివరాల్లోకి వెళితే.. ఖాజాగూడ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. చిరాగ్ స్కూల్ నుంచి ఇటుకల లోడుతో అతి వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి స్కూలు బస్సును ఢీకొట్టింది.

అనంతరం పక్కనే ఉన్న నాలా గోడను ఢీకొట్టి ఆగిపోయింది. బస్సులో పిల్లలు లేకపోవడంతో పెను ముప్పు తప్పినట్లయ్యింది. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.