హైదరాబాద్: తనతో సహాజీవనం చేసిన ప్రవీణ్‌కుమార్‌ మోసం చేశారని ఆరోపిస్తూ  పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి  పాల్పడిన లోకేశ్వరీ బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ  విషయమై ప్రవీణ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

చెన్నైలో నివాసం ఉంటున్న లోకేశ్వరీ మంగళవారం నాడు సాయంత్రం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  లోకేశ్వరీని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లోకేశ్వరీ బుధవారం నాడు మృతి చెందారు.

తనతో సహాజీవనం చేసిన ప్రవీణ్ కుమార్‌ తనను మోసం చేశారని లోకేశ్వరీ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఫిర్యాదు రాసి తీసుకొచ్చి ఆమె పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లోకేశ్వరీని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను ప్రవీణ్‌కుమార్‌పై  పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్వరీపై కూడ కేసులు ఉన్నట్టుగా చెబుతున్నారు.