Lok Sabha Elections 2024 : కాంగ్రెస్, బిజెపి లకు బిఆర్ఎస్ నేతలే దిక్కయ్యారా..? ఈ లిస్ట్ చూస్తే అవునంటారు?

ఈ లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్, బిజెపి లు కూడా సొంత పార్టీవారికి కాకుండా బిఆర్ఎస్ నుండి వలస వచ్చినవారికే టికెట్లు ఇస్తున్నాయి. ఇలా ఇంతకాలం బిఆర్ఎస్ లో కొనసాగి ఇప్పుడు ఇతరపార్టీల టికెట్లు పొందినవారు వీళ్ళే...

Lok Sabha Elections 2024 .... Telangana BJP  and  Congress Given MP tickets to Ex BRS Leaders AKP

హైదరాబాద్ : కొద్దిరోజుల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలు అలా ముగిసాయో లేదో ఇలా పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. కానీ ఈ మూడునాలుగు నెలల్లోనే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే వలసలు ప్రారంభమయ్యాయి. ఇటు రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ సత్తాచాటడం, అటు దేశంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తుందన్న ప్రచారం బిఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. బిఆర్ఎస్ లోక్ సభ టికెట్ ఇస్తామన్నా వద్దని కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ పాార్టీకి గుడ్ బై చెబుతున్నారు. చివరకు కేసీఆర్ తో ఎంతో సన్నిహితంగా వుండే కేశవరావు, కడియం శ్రీహరి వంటివారు కూడా పార్టీ మారారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలా బిఆర్ఎస్ ను వీడుతున్నవారిలో కొందరు కాంగ్రెస్ లో, మరికొందరు బిజెపిలో చేరుతున్నారు. దీంతో ఇంతకాలం ఓ వెలుగు వెలిగిన బిఆర్ఎస్ కు లోక్ సభ లో పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. 

తెలంగాణలో రేపటి(గురవారం) నుండి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. అధికార కాంగ్రెస్ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది... కాంగ్రెస్, బిజెపి కు బిఆర్ఎస్ నాయకులే దిక్కయ్యారని. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలను పార్టీలో చేర్చుకుని లోక్ సభ టికెట్లు ఇచ్చాయి బిజెపి, కాంగ్రెస్. కొన్ని నియోజకవర్గంలో అయితే ముగ్గురికి ముగ్గురు అభ్యర్థులు బిఆర్ఎస్ కు చెందిన వారే వున్నారు... మరికొన్ని స్థానాలు ఇద్దరు వున్నారు. 

వేరు వేరు పార్టీల నుండి ఎంపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న బిఆర్ఎస్, బిఆర్ఎస్ మాజీలు వీళ్లే...

1. వరంగల్ :

బీఆర్ఎస్ - మారేపల్లి సుధీర్ కుమార్ (ప్రస్తుతం ఎంపీ క్యాండిడెట్)

కాంగ్రెస్ - కడియం కావ్య (బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు)

బీజేపీ - అరూరి రమేష్ (బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే)

2. మల్కాజిగిరి :

బీఆర్ఎస్ - రాగిడి లక్ష్మా రెడ్డి (ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి)

కాంగ్రెస్ - పట్నం సునీత మహేందర్ రెడ్డి (బిఆర్ఎస్ మాజీ జడ్పీ ఛైర్ పర్సన్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య)

బీజేపీ - ఈటెల రాజేందర్ (బిఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి) 

3. చేవెళ్ల :

బీఆర్ఎస్ - కాసాని జ్ఞానేశ్వర్ (బిఆర్ఎస్ ప్రస్తుత అభ్యర్థి)

కాంగ్రెస్ - రంజిత్ రెడ్డి (గత లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు)

బీజేపీ - కొండా విశ్వేశ్వర్ రెడ్డి (బిఆర్ఎస్ మాజీ ఎంపీ. ప్రస్తుతం బిజెపి అభ్యర్థి)

4. మెదక్ :

బీఆర్ఎస్ - వెంకట్రామి రెడ్డి (మాజీ ఐఎఎస్ అధికారి. తన పదవికి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ పదవి పొందారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మారారు)

కాంగ్రెస్ - నీలం మధు (ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు బిఆర్ఎస్ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో బిఎస్పీ నుండి పోటీచేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థి అయ్యారు.)
 
బీజేపీ - రఘునందన్ రావు (గతంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చాలా సన్నిహితుడు. వివిధ కారణాలతో బిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరాడు) 

5. పెద్దపల్లి : 

కాంగ్రెస్ - గడ్డం వంశీకృష్ణ (మాజీ ఎంపీ గడ్డం వివేక్ తనయుడు. ఈయన గతంలో బిఆర్ఎస్, బిజెపిలో పనిచేసారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తనయుడిని ఎంపీ పోటీలో నిలిపారు.)

బిఆర్ఎస్ - కొప్పుల ఈశ్వర్ (మాజీ మంత్రి, ప్రస్తుతం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి)

బిజెపి - గోమాస  శ్రీనివాస్ (ఈయన  2009 లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దపల్లి నుండి పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు బిజెపి అభ్యర్థి)

6. జహిరాబాద్ :  

బిఆర్ఎస్ - గాలి అనిల్ కుమార్ (ప్రస్తుత బిఆర్ఎస్ అభ్యర్థి)

బిజెపి - బిబి పాటిల్ (గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం జహిరాబాద్ ఎంపీ. ఈయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీనుండే పోటీ చేస్తున్నారు.)

7. సికింద్రాబాద్ :

బిఆర్ఎస్ - పద్మారావు గౌడ్ (మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్. సికింద్రాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయనను ఎంపీ బరిలో నిలిపింది బిఆర్ఎస్) 
  
కాంగ్రెస్ - దానం నాగేందర్ (ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి పోటీచేసి గెలిచారు. ఇటీవలే కాంగ్రెస్ చేరి సికింద్రాబాద్ లోక్ సభ బరిలో నిలిచారు. 

8. ఆదిలాబాద్ : 

బిజెపి - గోడెం నగేష్ (2019 లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి పోటీచేసి బిజెపి అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయారు. కానీ ఇటీవలే బిజెపిలో చేరిన నగేష్ తనను ఓడించిన సోయం బాపూరావును కాదని ఎంపీ టికెట్ సాధించాడు.)

ఆత్రం సక్కు : (ప్రస్తుత బిఆర్ఎస్ అభ్యర్థి) 

9. నాగర్ కర్నూల్ :  

బిజెపి ‌- భరత్ ప్రసాద్ (గత ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రాములు తనయుడే భరత్ ప్రసాద్. బిఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతూనే బిజెపిలో చేరి తన కొడుకుకు టికెట్ ఇప్పించుకున్నారు రాములు) 

బిఆర్ఎస్ - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (మాజీ ఐపిఎస్ అధికారి అయిన ప్రవీణ్ తన పదవిని వదిలి బిఎస్పీ లో చేరారు. గత అసెంబ్లీ  ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల బిఆర్ఎస్ లో చేరిన ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు.)

10. నల్గొండ : 

బిజెపి - శానంపూడి సైదిరెడ్డి (బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయిన సైదిరెడ్డి బిజెపిలో చేరి నల్గొండ బరిలో నిలిచారు.  

బిఆర్ఎస్ - కంచర్ల కృష్ణారెడ్డి (ప్రస్తుత బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి) 

11. భువనగిరి : 

బూర నర్సయ్య గౌడ్ (బిఆర్ఎస్ మాజీ ఎంపీ. ప్రస్తుతం బిజెపి నుండి బరిలోకి దిగుతున్నారు)

క్యామ మల్లేష్  ( ప్రస్తుత బిఆర్ఎస్ అభ్యర్థి)

12. మహబూబా బాద్ :

సీతారాం నాయక్ (బిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరి మహబూబాబాద్ లోక్ సభలో పోటీ చేస్తున్నారు)

మాలోతు కవిత : (బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ. మళ్లీ  బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios