తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి లాక్‌డౌన్, కరోనా పరిస్థితులు, పీఆర్సీ అమలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం లాక్‌డౌన్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపడంతో కేబినెట్ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను ఈ ఏడాది మే  12వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తొలుత ఉదయం  6 గంటల నుండి 10 గంటల వరకు  లాక్‌డౌన్ ఆంక్షలకు మినహాయింపు ఉండేది. అనంతరం మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ ను పొడిగించారు. అయితే గత నెల చివర్లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో  లాక్‌డౌన్ ను  జూన్ 9వ తేదీకి పొడిగించింది ప్రభుత్వం. అయితే లాక్‌డౌన్ ఆంక్షలను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు మినహయింపు ఇచ్చారు. 

Also Read:ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం: పీఆర్సీ, లాక్‌డౌన్‌, భూముల విక్రయంపై చర్చ

ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట సమయం ఇచ్చింది సర్కార్. ప్రస్తుతం అమల్లో వున్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. దానిని సాయంత్రం 5 వరకు పొడిగించడం విశేషం. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించాలని కేబినెట్ నిర్ణయంచింది.