జీహెచ్ఎంసీ ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ప్రచారంలో నేతలకు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులను బస్తీ వాసులు నిలదీస్తున్నారు.

తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి తరపున ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మారావును బస్తీ వాసులు అడ్డుకున్నారు. వరదలు వచ్చినప్పుడు  రాని నువ్వు ఇప్పుడు  ఎందుకు వచ్చావంటూ నిలదీశారు.

చేసేదేమి లేక వెనుదిరిగారు పద్మారావు. అటు ముషీరాబాద్ బోలక్‌పూర్‌లో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీకి చేదు అనుభవం ఎదురైంది.

ఎంఐఎం కార్పోరేటర్ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన అక్బరుద్దీన్‌ను మాట్లాడనివ్వలేదు స్థానికులు. ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తమకు రాజకీయాలు వద్దు, అభివృద్దే కావాలంటూ పెద్దగా నినాదాలు చేశారు. స్థానికులు తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు అక్బరుద్దీన్