ఇక్రిశాట్ లో  చిరుతపులిని పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇక్రిశాట్ లో చిరుతపులి సంచరిస్తోంది. తొలిసారి ఫిబ్రవరిలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించినట్లు సమాచారం.

కాగా.. స్థానికుల సమాచారంతో చిరుత కోసం అటవీశాఖ అధికారులు మాటు వేశారు. చాకచక్యంగా దానిని పట్టుకున్నారు. మంగళవారం రాత్రి ఆ చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అనంతరం దానిని నెహ్రూ జూ పార్క్ కి తరలించారు. దానికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అటవీ ప్రాంతంలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.