Asianet News TeluguAsianet News Telugu

మంథని కోర్టుకు బిట్టు శ్రీను.. న్యాయవాదుల ఆందోళన, సీపీ సస్పెన్షన్‌కు డిమాండ్

పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా వున్న బిట్టు శ్రీనును పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చారు.

lawyers protest at manthani court ksp
Author
manthani, First Published Feb 23, 2021, 6:20 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా వున్న బిట్టు శ్రీనును పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చారు.

విషయం తెలుసుకున్న లాయర్లు పెద్ద సంఖ్యలో న్యాయస్థానం వద్దకు చేరకున్నారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, వామన్‌రావు కేసులో బిట్టు శ్రీనును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హంతకులకు ఆయుధాలతో పాటు కారు సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వామన్ రావు దంపతుల హత్యకు బిట్టు శ్రీను కుట్ర చేసినట్లు తేల్చారు.

Also Read:వామన్‌రావు హత్యకు ప్రత్యేకంగా ఆయుధాలు తయారీ, బిట్టు శీను అరెస్ట్: ఐజీ నాగిరెడ్డి

శ్రీను నడుపుతున్న పుట్టా ట్రస్ట్‌పై వామన్ రావు కేసులు వేశారు. పిటిషన్‌లతో బిట్టు శ్రీను ఆదాయం కోల్పోయాడని.. దాంతో వామన్ రావుపై కక్ష పెంచుకున్నాడని చెప్పారు పోలీసులు.

ఆదాయ మార్గాలు గండి కొట్టినందుకు వామన్ ‌రావును హత్య చేసేందుకు బిట్టు శ్రీను కుట్ర చేశాడని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ రోజు లేదా రేపు అతనిని అదుపులోకి తీసుకునే అవకాశం వుందని సమాచారం. ఈ హత్య కేసులో మొత్తం ఐదుగురి ప్రమేయం వున్నట్లు పోలీసులు తేల్చారు. కుంట శ్రీను, బిట్టు శ్రీను, చిరంజీవి, కుమార్‌లను ఇప్పటికే ఖాకీలు అరెస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios