ములుగు జిల్లాలో మల్లారెడ్డి అనే న్యాయవాది దారుణహత్య కలకలం రేపుతోంది. ములుగు ప్రధాన రహదారి పందికుంట స్టేజి దగ్గర మల్లారెడ్డిని వెనుక నుంచి ఇన్నోవాతో ఢీకొట్టి కత్తులతో పొడిచిన దుండగులు ఆయనను హతమార్చారు
ములుగు జిల్లాలో మల్లారెడ్డి అనే న్యాయవాది దారుణహత్యకు గురయ్యాడు. వెనుక నుంచి ఇన్నోవాతో ఢీకొట్టి కత్తులతో పొడిచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లంపల్లిలో మల్లారెడ్డికి సంబంధించిన భూతగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
