Asianet News TeluguAsianet News Telugu

సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం: పరుగులు తీసిన ప్రజలు

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం గోవిందాపురంలో భూ వివాదం కాల్పులకు దారి తీసింది. ఇరు వర్గాల ఘర్షణలో ఓ వర్గం గాల్లోకి తుపాకీతో కాల్పులకు దిగింది.దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

land dispute: Man fires four rounds in air in sangareddy district lns
Author
Sangareddy, First Published Nov 16, 2020, 4:41 PM IST


సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం గోవిందాపురంలో భూ వివాదం కాల్పులకు దారి తీసింది. ఇరు వర్గాల ఘర్షణలో ఓ వర్గం గాల్లోకి తుపాకీతో కాల్పులకు దిగింది.దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

గోవిందాపూర్ కు చెందిన నందకిషోర్ తో పాటు మరో వ్యక్తికి ఈ గ్రామంలో ఉన్న 30 ఎకరాల భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి.ఈ భూమి వద్ద నందకిషోర్ తరపున  ఇద్దరు ఇక్కడ పనులు చేస్తున్నారు.

అయితే ఈ భూ వివాదం విషయమై  నందకిషోర్ తో మరో వ్యక్తి కొంతకాలంగా గొడవకు దిగాడు.ఇదే విషయమై ఇవాళ కూడ ఈ భూమి వద్ద ఉన్న నందకిషోర్  నియమించుకొన్న ఇద్దరు పని మనుషులను ప్రత్యర్ధి వ్యక్తి బెదిరించినట్టుగా స్థానికులు చెప్పారు.
ఈ క్రమంలోనే తుపాకీతో నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడని స్థానికులు చెబుతున్నారు. 

కాల్పుల శబ్దం విని స్థానికులు పరుగులు తీశారు.ఈ సమయంలో నందకిషోర్ అక్కడ లేడు.  ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.కాల్పులు జరిపిన వ్యక్తికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios