Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ లోన్ యాప్స్: ఢిల్లీలో సీసీఎస్ కాపు.. ప్రధాన సూత్రధారి లాంబో అరెస్ట్

లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. చైనాకు చెందిన లాంబోను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో లాంబోను అదుపులోకి తీసుకున్నారు

lambo arrested in delhi over online loan apps case ksp
Author
New Delhi, First Published Dec 30, 2020, 7:29 PM IST

లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. చైనాకు చెందిన లాంబోను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో లాంబోను అదుపులోకి తీసుకున్నారు.

లోన్ యాప్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో లాంబో చైనాకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. 4 కంపెనీల ద్వారా లోన్ యాప్స్ నడుపుతున్నాడు లాంబో.

ఈ వ్యవహారంలో లాంబోకు పూర్తి స్థాయిలో సహకరించిన నాగరాజును కూడా అరెస్ట్ చేశారు. నాగరాజు స్వస్థలం కర్నూలు. లాంబో 6 నెలల కాలంలో రూ.21 వేల కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.

150 యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా తేల్చారు. భారత్ నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నిధుల మళ్లింపుపై సీసీఎస్ ఆరా తీస్తోంది. వేల కోట్ల నిధుల మళ్లింపుపై కేంద్రానికి సమాచారం ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios