ఘనంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు.. తొలి బోనం సమర్పించిన తలసాని

Lal Darwaza Simhavahini Mahankali Temple Bonalu Festival
Highlights

పాతబస్తీలో కొలువై ఉన్న లాల్ దర్వాజా సింహావాహిని అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు.. శాలిబండలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించారు

పాతబస్తీలో కొలువై ఉన్న లాల్ దర్వాజా సింహావాహిని అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు.. శాలిబండలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించారు.

ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు బోనాలు సమర్పించేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి దర్శనానికి వీఐపీలు క్యూకడుతున్నారు. ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.

loader