సర్వేలను వ్యక్తిగత కోణంలో చూడలేమని, ఒక్కో నియోజకవర్గం విషయంలో ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చని లగడపాటి అన్నారు. సర్వే ఫలితాల్లో గెలుస్తామని చెప్పిన స్థానాల్లో అభ్యర్థులు కొన్ని సార్లు ఎన్నికల ప్రచారంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల కూడా  ఓడిపోవచ్చని ఆయన అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి ప్రజా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన నందమూరి సుహాసిని పరాజయంపై మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

సర్వేలను వ్యక్తిగత కోణంలో చూడలేమని, ఒక్కో నియోజకవర్గం విషయంలో ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చని లగడపాటి అన్నారు. సర్వే ఫలితాల్లో గెలుస్తామని చెప్పిన స్థానాల్లో అభ్యర్థులు కొన్ని సార్లు ఎన్నికల ప్రచారంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల కూడా ఓడిపోవచ్చని ఆయన అన్నారు. అలాగే ఓడిపోతారని చెప్పిన స్థానాల్లో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. సుహాసిని ఓటమికి కూడా ఇలాంటి కారణాలే ఉండి ఉండవచ్చని లగడపాటి అన్నారు.

తాను సర్వేలు చేయడం మాననని లగడపాటి చెప్పారు. కాకపోతే ఇకపై వెల్లడించే సర్వే ఫలితాలు పోలింగ్ తర్వాత మాత్రమే వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రీ పోల్ సర్వే ఫలితాలు తిరగబడడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా సర్వేలు చేస్తానని, ఫలితాలను మాత్రం ఎన్నికలు ముగిసిన తర్వాతే వెల్లడిస్తానని లగడపాటి తెలిపారు.