హైదరాబాద్: రోజూ వేధింపులకు గురి చేస్తున్నాడనే నెపంతో  ఓ లేడీ టెక్కీ యువకుడిని కిడ్నాప్ చేసింది.

హైదరాబాద్: రోజూ వేధింపులకు గురి చేస్తున్నాడనే నెపంతో ఓ లేడీ టెక్కీ యువకుడిని కిడ్నాప్ చేసింది. కిడ్నాప్‌కు గురైన యువకుడిని గంట లోపుగా పోలీసులు విడిపించారు. 

తనను వేధింపులకు గురి చేస్తున్న పోకిరిని స్నేహితులతో కలిసి టెక్కీ స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసింది. స్నేహితులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దివ్య స్కెచ్ వేసింది. 

సెయింట్ ఆన్స్ కాలేజీ వద్ద సాయి అనే కార్పెంటర్ కు పోన్ చేసింది. సాయి ప్రతి రోజూ సాయి పోన్ చేసి దివ్యను వేధింపులకు గురి చేస్తున్నాడు.సాయిని మోటార్‌బైక్‌పై తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సాయిని కొట్టారు. యువకుడిని కిడ్నాప్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు. గంటలోపుగానే పోలీసులు కిడ్నాప్‌ కేసును చేధించారు.

సాయిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దివ్యతో పాటు ఆమెకు సహకరించిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చివరకు దివ్యతో పాటు ఆమెకు సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.