దుమ్ము రేపిన సెలబ్రేషన్స్

ఆమె కర్నూలు నగర ఎంఐఎం కార్పొరేటర్. కుర్మగూడ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. పేరు డాక్టర్ సమీనా తాలాబ్ కట్ట బేగం. కానీ ఆమె డిసెంబరు 31వ తేదీ రాత్రి జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో డ్యాన్స్ చేసి దుమ్ము రేపారు. అది కూడా నాగిని డ్యాన్స్ తో అదరగొట్టారు.

కర్నూలులోని యూనానీ మెడికల్ కాలేజీలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. దీనికి కార్పొరేటర్ సమీనా బేగం అతిధిగా హాజరయ్యారు. అయితే కాలేజీ వేడుకలు కావడంతో స్టూడెంట్స్ జోష్ మీదున్నారు. దీంతో కార్పొరేటర్ వేదిక మీద డ్యాన్స్ చేసి యూత్ లో మరింత జోష్ నింపారు.

మహిళా కార్పొరేటర్ డ్యాన్స్ పై విమర్శలు

కర్నూలు నగర ఎంఐఎం మహిళా కార్పొరేటర్ సంతోషంతో చేసిన డ్యాన్స్ పై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆమె డ్యాన్స్ చేయడం పట్ల ముస్లిం సోషల్ మీడియాలో షేమ్ షేమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని ముస్లిం ఫేస్ బుక్ గ్రూపులలో ఆమెకు వ్యతిరేకంగా, హేళనగా పోస్టులు పెడుతున్నారు. 

అయితే మహిళా కార్పొరేటర్ డ్యాన్స్ తో వేడుకలు కలర్ ఫుల్ గా సాగాయి. ఆమె డ్యాన్స్ వీడియో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.