Asianet News TeluguAsianet News Telugu

లాయర్ దంపతుల హత్య: కుంట శ్రీనుపై టీఆర్ఎస్ వేటు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా వున్న కుంట శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది టీఆర్ఎస్ పార్టీ. పార్టీ మండలాధ్యక్షుడిగా వున్న కుంట శ్రీనివాస్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు టీఆర్ఎస్ నేతలు. 

kunta srinivas suspended from trs party ksp
Author
Hyderabad, First Published Feb 18, 2021, 6:18 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా వున్న కుంట శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది టీఆర్ఎస్ పార్టీ. పార్టీ మండలాధ్యక్షుడిగా వున్న కుంట శ్రీనివాస్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు టీఆర్ఎస్ నేతలు. 

అడ్వకేట్ వామన్ రావు దంపతులను హత్య కేసులో ముగ్గురిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.ఈ నెల 17వ తేదీన కాల్వచర్లలో  వామన్ రావు దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు.ఈ హత్య జరిగిన తర్వాత పోలీసుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.

హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడ వామన్ రావుకు  రక్షణ కల్పించలేదని పోలీసులను కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు.వామన్ రావు దంపతులను హత్య చేసిన తర్వాత నిందితులను మహారాష్ట్ర సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

వామన్ రావు దంపతుల కదలికలను అక్కపాక కుమార్ రెక్కీ నిర్వహించాడు.ఈ సమాచారాన్ని శ్రీనివాస్ కు అందించినట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ తో పాటు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయవాద దంపతులను చంపిన నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు 10 బృందాలను సీపీ ఏర్పాటు చేశారు.

నిందితులను పోలీసులు ఇవాళ రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల్లో విధులను న్యాయవాదులు ఇవాళ బహిష్కరించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios