నా ఉద్దేశం అది కాదు.. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలి : కేటీఆర్

జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలని.. శుక్రవారం క్రెడాయ్ వార్షికోత్సవంలో తాను మాట్లాడిన మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, అవి అన్యాపదేశంగా చేసినవని.. కేటీఆర్ అర్థరాత్రా ట్వీట్ చేశారు. 

KTR tweet over satirical comments on ap government in credai

హైదరాబాద్ : తాను ఈ రోజు ఇక్కడ credai సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చు అని మంత్రి KTR పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధపెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదు అని వివరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో tweet చేశారు. ‘నేను ఏపీ సీఎం  YS Jaganను సోదర సమానుడిగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా’  అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అని తనకు కొందరు చెప్పారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం అన్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కెల్లా హైదరాబాదే అత్యుత్తమ నగరంగా ఆయన పేర్కొన్నారు.  శుక్రవారం నాడు హైదరాబాద్ లో జరిగిన క్రెడాయ్ 11వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్లో roads, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే  ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లు వేసుకొని వెళ్లి రావాలన్నారు కేటీఆర్. పక్క రాష్ట్రానికి  పోయివచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో  పరిస్థితులు ఎంత బాగున్నాయో  తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు.  

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో రోడ్లు, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్రంలో కరెంటు లేదు. నీళ్లు లేవు అన్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటించి వాస్తవాలు తెలుస్తాయి. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లంచాలు ఇస్తేనే అనుమతులు  వస్తాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో పరిశ్రమలకు,  పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు. అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని  విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా  కేటీఆర్ ప్రస్తావించారు. 

కెసిఆర్ అప్పు చేసి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తు తరాల మీద  పెట్టేది పెట్టుబడి అవుతుందని కేటీఆర్ చెప్పారు. 111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఈ జీవోను నా కోసమే ఎత్తివేశారు అని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో కూడా  ఈ జీవోను ఎత్తివేసేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.

1.30 లక్షల ఎకరాలు నావేనా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ 111 జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లే ఉందని ఆ ప్రాంతానికి చెందిన వారు తనకు చెప్పారన్నారు కేటీఆర్. బెంగళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండి పడుతున్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రశాంతమైన రాస్ట్రం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో ఏపీ వాసులకు అర్థమైందని కేటీఆర్ చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios