Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్ ఘటన.. తప్పుడు ట్వీట్ పై కేటీఆర్ రెస్పాన్స్..!

ఈ ఘటనకు జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు దొరికేశాడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో.. అందరూ అదే నిజమని అనుకున్నారు. కానీ.. నిందితుడు దొరకలేదని తర్వాత పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
 

KTR Tweet on Saidabad Incident
Author
Hyderabad, First Published Sep 15, 2021, 10:10 AM IST

సైదాబాద్ పోలీస్ స్టేషన్  పరిధిలో ఇటీవల ఆరేళ్ల బాలికపై ఇటీవల ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ.. అందరూ డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు దొరికేశాడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో.. అందరూ అదే నిజమని అనుకున్నారు. కానీ.. నిందితుడు దొరకలేదని తర్వాత పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

కాగా.. తాజాగా.. తాను చేసిన తప్పుడు ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను చేసిన తప్పుడు ట్వీట్ ని ఉపసంహకరించుకున్నారు. సమాచార లోపంతో నిందితుడుని పోలీసులు వెంటనే అరెస్టు చేసినట్లు పొరపాటున తాను చేసిన ప్రకటన పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. 

 

నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని.. అతనిని  పట్టుకునేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్లున్నారని.. కేటీఆర్ చెప్పారు. నిందితుడిని తర్వగా పట్టుకొని.. తగిన శిక్ష పడటం ద్వారా బాధితులకు తగిన న్యాయం జరగాలని కోరుకుందామని కేటీఆర్ ఆకాంక్షించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios