Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ జెండా పండగ : ఘనంగా నిర్వహిద్దాం - పార్టీ శ్రేణులకు కెటియార్ పిలుపు

అదే రోజు డీల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సిఎం కెసియార్  చేస్తున్న శంఖుస్థాపనకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఈ జెండా పండగ విజయవంతానికి ‌కృషి చేయాలన్నారు. ఈమేరకు  ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, సినియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలన్నారు.

ktr teleconference with party cadres due to patry flag festival on september 2
Author
Hyderabad, First Published Aug 31, 2021, 12:01 PM IST

 హైదరాబాద్ : సెప్టెంబర్ రెండవ తేదీన జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. ఈమేరకు ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు,    ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పిటీసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్టీ సర్పంచులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ సంస్ధగత నిర్మాణంపైన దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమానికి గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. 

 

అదే రోజు డీల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సిఎం కెసియార్  చేస్తున్న శంఖుస్థాపనకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఈ జెండా పండగ విజయవంతానికి ‌కృషి చేయాలన్నారు. ఈమేరకు  ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, సినియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలన్నారు.

ఈ జెండా పండగ తర్వత వెంటనే పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా కమీటీల ఎర్పాటు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఈమేరకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీలను నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ 20 వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక,  జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని తెలిపారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖరరావు ప్రకటిస్తారని కెటియార్ తెలిపారు. జిల్లా అద్యక్షులు నూతన జిల్లా కార్యవర్గాలను పార్టీ  ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకుని ప్రకటిస్తారన్నారు.

పార్టీ కమిటీల కూర్పు విషయంలో కెటియార్ పలు సూచనలు చేశారు.  పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఈ కమిటీలలో చోటు ఉంటుందన్నారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని, లేకుంటే అయా కమీటీలు చెల్లవన్నారు. పార్టీ అనుబంధ కమీటీలతో పాటు గ్రామ, మండల స్థాయి పార్టీ సోషల్ మీడియా కమిటీ ఏర్పాటుకు సూచనలు చేశారు. ముందుగా మండల  కమిటీలు పూర్తి చేసిన తర్వత గ్రామ స్ధాయి సోషలు మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కమీటీల్లో మహిళా కార్యకర్తలకు తగిన చోటు కల్పించాలని సూచించారు.

హైదరాబాద్ నగర ప్రత్యేక సమావేశం
హైదరాబాద్ నగర విస్తృతి, జనాభా, ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక నగర సమావేశం ఉంటుందన్నారు. నగరంలో బస్తి కమిటీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల ఏర్పాటులో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం ఈ విషయంలో సమన్వయం  చేసుకుంటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో హైదరాబాద్ నగర ప్రత్యేక సమావేశం త్వరలో ఉంటుందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios