తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా... ఆయన కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తాజాగా.. హరీష్ రావుకి కరోనా సోకడంపై మరో మంత్రి కేటీఆర్ స్పందించారు.

‘బావా త్వరగా కోలుకో.. ఇతరులకంటే త్వరగా కోలుకుంటావన్న నమ్మకం నాకుంది’ అని ట్వీట్ చేశారు. కాగా.. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. 

ప్రాథమిక లక్షణాలు ఉండటంతో టెస్ట్‌ చేయించుకున్నానని, పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని.. ఎవరూ ఆందోళనచెందాల్సిన అవసరం లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్‌ అయిన వారు క్వారైంటన్‌లో ఉండాలని, టెస్ట్‌ చేయించుకోవాలని హరీష్‌రావు కోరారు.