తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ను ఆ ట్వీట్‌లో ప్రస్తావించడమే ఇందుకు కారణం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ను ఆ ట్వీట్‌లో ప్రస్తావించడమే ఇందుకు కారణం. అసలు హిమాన్షు బాలకృష్ణ డైలాగ్‌ను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల గమనిస్తున్న వారికి హిమాన్షు పేరు సుపరిచతమే. పలు సందర్భాల్లో హిమాన్షు తన తాతా కేసీఆర్‌తో పర్యటించారు. కేసీఆర్ అధికార పర్యటనల్లో కూడా మనవడిని తీసుకెళ్తున్నారని ఆరోపించిన విపక్షాలు ఆరోపణలు చేశాయి.
మరోవైపు హిమాన్షు బరువు ఎక్కువగా ఉన్నారంటూ కొందరు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలోనే హిమాన్షును విపరీతంగా ట్రోల్ చేయడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు సైతం వారికి కౌంటర్స్ ఇచ్చారు. పలువురు రాజకీయ నాయకులు సైతం హిమాన్షు బరువుపై కామెంట్స్ చేయడం తీవ్ర దుమారమే రేపింది. తీన్మార్ మల్లన్న ఓ సందర్భంలో చేసిన కామెంట్స్‌పై టీఆర్ఎస్ శ్రేణులు ఓ రేంజ్‌లో మండిపడ్డాయి. దీనిపై కేటీఆర్ నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. బీజేపీ మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భావప్రకటన స్వేచ్ఛ ఉందనే పేరుతో ఇతరులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం కేటీఆర్ సైతం హితవుపలికారు.
మరోవైపు హిమాన్షు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. కొన్ని సామాజిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటున్నారు. అయితే కొంతకాలంగా తన బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే హిమాన్షు బరువు తగ్గారు. అయితే హిమాన్షు ఇటీవలి ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ నెటిజన్.. ‘‘సడన్‌గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్టులో హిమాన్షును కూడా ట్యాగ్ చేశారు.
అయితే దీనిపై ఫన్నీగా స్పందించిన హిమాన్షు.. బాలయ్య డైలాగ్‌తో రిప్లై ఇచ్చారు. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి.. అని ఒక మహానుభావుడు ఒకసారి అన్నాడని హిమాన్షు పేరొన్నారు. అయితే జోకులు అలా పక్కన పెడితే.. థాంక్స్ అని పోస్టు చేశారు. అయితే ఈ పోస్టు ప్రస్తతం వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన పలువురు.. హిమాన్షు సేమ్ టూ సేమ్ కేటీఆర్‌లా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఆ నెటిజన్ పోస్టుపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు.
