కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె.. అంటూ బీజేపీ మ్యానిఫెస్టో రైటర్స్ మీద కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో లో ఫొటోలు అన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన ఫొటోలు వాడడం మీద ఇలా రియాక్ట్ అయ్యారు. 

టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు తమ మ్యానిఫెస్టోలో బీజేపీ వాడిందని, ఇది తాము కాంప్లిమెంట్ లా తీసుకుంటున్నామని చురకంటించారు. 

అయితే ఇలా వాడడాన్ని హైదరాబాద్ లో  ఏమంటారో తెలుసా.. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె.. నకల్ మార్ నే ఖో భీ అఖల్ ఛాహియే.. అంటూ ట్వీట్ చేశారు. 

బీజేపీ మ్యానిఫెస్టో ఫేక్ అంటూ పుట్ట విష్ణువర్థన్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. నకల్ మార్ నే ఖో భీ అఖల్ ఛాహియే.. అంటూ కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె, బండన్న నీ తెలివికి దండం రా నాయానా.. ఫేక్ బీజేపీ  అంటూ ట్వీట్ చేశాడు.