Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన కేటీఆర్ భార్య ఆస్తులు: ఆయన ఆస్తుల పెంపు తక్కువే

అఫిడవిట్ ప్రకారం కేటీఆర్ ఆస్తులు కొద్దిగా మాత్రమే పెరిగాయి. అయితే, ఆయన భార్య ఆస్తులు మాత్రం పెద్ద యెత్తున పెరిగాయి. కేటీఆర్ భార్య స్థిరాస్తులు 2014లో రూ.2.05 కోట్లు ఉండగా 2018నాటికి రూ. 27.70 కోట్లకు పెరిగాయి. ఆమె పెట్టుబడుల వాటా 74.65 లక్షలు ఉండగా అవి రూ.8.98 కోట్లకు పెరిగాయి. 

KTR's wife makes more in terms
Author
Sircilla, First Published Nov 20, 2018, 8:01 AM IST

హైదరాబాద్: కేటీఆర్ గా పేరు పొందిన తాజా మాజీ మంత్రి కేటీ రామారావు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బిగ్ ఫైవ్ లో ఒక్కరు. సిరిసిల్ల నుంచి ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ తో పాటు తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ ను కూడా ఆయన సమర్పించారు. 

ఆ అఫిడవిట్ ప్రకారం కేటీఆర్ ఆస్తులు కొద్దిగా మాత్రమే పెరిగాయి. అయితే, ఆయన భార్య ఆస్తులు మాత్రం పెద్ద యెత్తున పెరిగాయి. కేటీఆర్ భార్య స్థిరాస్తులు 2014లో రూ.2.05 కోట్లు ఉండగా 2018నాటికి రూ. 27.70 కోట్లకు పెరిగాయి. ఆమె పెట్టుబడుల వాటా 74.65 లక్షలు ఉండగా అవి రూ.8.98 కోట్లకు పెరిగాయి. 

తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆమె పెట్టుబడులు రూ.18.07 కోట్లు ఉన్నాయి. ఇందులో కేసీఆర్ పెట్టుబడుల వాటా అతి ఎక్కువ.

2014లో కేటీఆర్ చరాస్తుల విలువ రూ.2.97 కోట్లు కాగా, ఆయన భార్య శైలిమ చరాస్టుల విలువ రూ.2.05 కోట్లు. కేటీఆర్ చరాస్తుల విలువ రూ.74.65 కోట్లు కాగా శైలిమ చరాస్తుల విలువ రూ.2.12 లక్షలు.

2018లో కేటీఆర్ చరాస్తుల విలువ రూ.3.63 కోట్లు కాగా శైలిమ చరాస్తుల విలువ రూ.27.70 కోట్లు. కేటీఆర్ స్థిరాస్తుల విలువ రూ.1.30 కోట్లు కాగా శైలిమ స్థిరాస్తుల విలువ రూ.8.98 కోట్లు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ ఆస్తులెంతో తెలుసా... 

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

సొంత ఇల్లులేదు, కారు లేదు కానీ.. ఆస్తులు మాత్రం రూ.300కోట్లు

తాజా మాజీ మంత్రుల భార్యల ఆస్తులకు రెక్కలు

Follow Us:
Download App:
  • android
  • ios